25న ముదిరాజ్‌ ప్లీనరీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లో ఈనెల 25న నిర్వహించతలపెట్టిన ముదిరాజ్‌ ప్లీనరీని జయప్రదం చేయాలని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్‌ పిలుపునిచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ముదిరాజ్‌ల జనాభా ఎక్కువగా ఉన్నందున ఆయా జిల్లాల్లో రెండేసి అసెంబ్లీ సీట్ల చొప్పున కేటాయించాలని ఒక ప్రకటనలో ఆయన అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కేటగిరీకి మార్చాలని కోరారు. మత్స్య పరిరక్షణ చట్టాన్ని తీసుకు రావాలనీ, ముదిరాజ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రూ.3 వేల కోట్లను కేటాయించటం ద్వారా మత్స్యకారులకు రుణాలనివ్వాలనీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టుల్లో ముదిరాజ్‌లకు తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరారు.