బీహార్‌ జర్నలిస్ట్‌ హత్య కేసులో నలుగురు అరెస్టు

పాట్నా : బీహార్‌లో దైనిక్‌ జాగరణ్‌ వార్తాపత్రిక జర్నలిస్టు విమల్‌ కుమార్‌ యాదవ్‌ (35) హత్య కేసులో నలుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బీహార్‌లోని అరారియా జిల్లాలోని ప్రేమ్‌నగర్‌ గ్రామంలో తన నివాసంలోనే విమల్‌ కుమార్‌ యాదవ్‌ను శుక్రవారం దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.