కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియచేసిన అర్బన్ ఎమ్మెల్యే 

నవతెలంగాణ- కంటేశ్వర్

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గణేష్ బిగాలని ఖరారు చేయడంతో ప్రగతి భవన్ లో  కేసీఆర్ ని కలిసి ధన్యవాదాలు సోమవారం తెలిపారు. 60 ఏండ్ల పాలనలో జరగని అభివృద్ధి ని 9 సంవత్సరాల కాలం లో ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆశీస్సులతో, మంత్రి వర్ర్యులు కేటీఆర్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత  సహకారం తో నిజామాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రం లో హైదరాబాద్ తరువాత స్థానంలో ఉందని ఎమ్మెల్యే  గణేష్ బిగాల  అన్నారు. నిజామాబాద్ నగరం లో చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు, బి.ఆర్.ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో పటిష్టత కు కృషి చేయడంతో 3వ సారి ముఖ్యమంత్రి  కేసీఆర్  అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యమంత్రి  కేసీఆర్  ఆశీర్వాదం తో నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరి సహకారంతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం లో 3వ సారి గులాబీ జెండా ఎగురవేసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మరింత సేవ చేస్తానని తెలియచేశారు.