బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడిగా అరుగుల అక్షయ్

నవతెలంగాణ కంటేశ్వర్

బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఈరవత్రి అనిల్ అన్న సూచన మేరకు అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడిగా అరుగుల అక్షయ్ మీ నియమించడం బుధవారం  జరిగింది. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో తనను బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడిగా నియమించినందుకు ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ కి  ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్కి ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ స్వామి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అలాగే నా నియామకం కోసం కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఇకపై బాల్కొండ నియోజకవర్గంలోఎన్.ఎస్.యు.ఐ బలోపేతానికి కృషి చేయడంతో పాటు విద్యారంగ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామని అలాగే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఎన్.ఎస్.యు.ఐ తరఫున మా వంతు పాత్ర పోషిస్తామని తెలియజేస్తున్నాను అన్నారు.