ఇస్రో శాస్త్రవేత్తకు శ్రీచైతన్య అభినందనలు

Sri Chaitanya congratulates the ISRO scientistనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చంద్రయాన్‌-3 విక్రమ్‌ లాండర్‌ చంద్రునిపై విజయవంతంగా అడిగిడిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌ సీమా అభినందనలు తెలిపారు. భారత అంతరిక్షయాన చరిత్రలోనే ఇది ఒక మరుపురాని విజయమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌-1,2లను స్ఫూర్తిగా తీసుకుని ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరాయంగా చేసిన కృషికి ఇది నిదర్శనమని తెలిపారు. శ్రీచైతన్య పాఠశాలలో చదివే విద్యార్థులు నాసా, ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌లో పాల్గొని విజయాలను సాధిస్తున్నారని వివరించారు. నాసా ఏటా నిర్వహించే ఐఎస్‌డీసీ కాన్ఫరెన్స్‌కు పదేండ్లుగా రికార్డు స్థాయిలో శ్రీచైతన్య విద్యార్థులు ఎంపికవుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది డల్లాస్‌లో నిర్వహించే ఐఎస్‌డీసీ కాన్ఫరెన్స్‌కు శ్రీచైతన్య స్కూల్‌ నుంచి 110 మంది విద్యార్థులు హాజరై చరిత్ర సృష్టించారని తెలిపారు. హర్షవర్ధన్‌రెడ్డి ఇటీవల నాసాలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారని వివరించారు. ఇస్రో భావి కార్యక్రమాలు ఆదిత్య ఎల్‌1, శుక్రయాన్‌, గగన్‌యాన్‌, మంగళ్‌యాన్‌2, నిసార్‌ కార్యక్రమాలూ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అంతరిక్షరంగంలో భారత్‌ అగ్రస్థానంలో నిలవాలని కోరారు. చంద్రయాన్‌-3 విజయవంతమైన సందర్భంగా శ్రీచైతన్య విద్యార్థులు విజయోత్సవ ర్యాలీలు, అభినందన సభల ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.