నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగ ప్రభుత్వ సలహాదారుగా వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్‌బాబు నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కేబినెట్ హౌదా కలిగిన ఈ పదవిలో ఆయన ఐదేండ్లు ఉంటారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చెన్నమనేని రమేశ్ బాబు జర్మనీకి చెందిన హంబోల్ట్ యూనివర్శిటీ నుంచి ‘అగ్రికల్చర్ ఎకనామిక్స్’లో పీహెచ్‌డీ చేశారు.