నేస్తం

కలలతో నడిచిన ప్రతి అడుగు
నీదే కదా నేస్తం…
భయంతో ఎందుకు
వెనక్కి వెనక్కి అడుగులు వేస్తున్నావ్‌..
నీతో వీళ్ళు నిలబడరనా..
నీతో వీళ్ళు నడవరానా…
లేదా అవకాశాల మెట్లు కూలిపోతున్నాయనా…
ఒంటరితనం గాయపు
ఆగాధపు అలజడిలోకి నెట్టి వేస్తుందా…
అలసిపోయిన హదయం…
బలహీనతల వెనక పరిగెడుతుందా..
అవమానపు అడుగుల భారం మోయలేవా..
నీ కదలక పునడకలన్నీ
వెనక్కి వెనక్కి కదులుతున్నాయి..
మాటల నిందలను నెత్తికెత్తుకోలేవా
నీలో ఈ వింత పోకడలు…
నీలో ప్రశాంతత లేని యుగాంతం
ఏదో విధ్వంశాన్ని గుర్తిస్తుందా..
కాలు కదిపితే
మళ్ళీ వెనక్కి రాలేదని మొహమాటమా..
ఇంట్లో పెళ్ళాం బిడ్డలు..
అమ్మానాన్నలు యాదికొస్తున్నారా..
ఎంచుకున్న దారేమో..
ఏ పొదల మాటున
ఏ ఆపద పొంచి ఉంచిందో తెలియదు..
ఏ కనికరం వెనక
ఏ కుట్ర అల్లిందో తెలియదు కదా..
అందుకే ప్రతినిత్యం అప్రమత్తమ అంటూ..
గుండె ప్రతిధ్వనిస్తుందా…
ఆశయపు కనికల చుట్టూ…
ఆవేదన మబ్బులు ముసిరినాయా…
చల్లారుస్తూ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాయా…
పొందితే మరణమే కదా…
చిందితే రక్తమే కదా…
శవాలన్నీ కవాతు చేస్తూ..
చైతన్యాన్ని పురుడు పోసుకుని..
మళ్లీ పుట్టుకొస్తుంది కదా..
అందుకే
అడుగులు ముందుకు వెయ్యి
అడుగులు ముందుకు వెయ్యి….
– టి.వి.కౌశిక్‌
7601061383