నామినేషన్లు దాఖలు చేసిన హెచ్‌ఆర్‌డీఏ ప్యానెల్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు హెల్త్‌ కేర్‌ రిఫార్మ్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) టీం నామినేషన్లు దాఖలు చేసింది. శనివారం హైదరాబాద్‌ కోఠిలోని టీఎస్‌ఎంసీ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్లు సమర్పించిన హెచ్‌ఆర్‌డీఏ ప్యానెల్‌లో డాక్టర్లు మహేశ్‌ కుమార్‌, కిరణ్‌ కుమార్‌ తోటావర్‌, శ్రీనివాస్‌ గుండగానీ, నరేష్‌ కుమార్‌ వి., ఎ.సన్నీ డెవీస్‌, బండారి రాజ్‌ కుమార్‌, ఎస్‌.ఆనంద్‌, కుసుమరాజు రవి కుమార్‌, సయ్యద్‌ ఖాజా ఇమ్రాన్‌ అలీ, కున్‌ విష్ణు, ప్రతిభా లక్ష్మి, యెగ్గన శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ జుకురు ఉన్నారు.