హైదరాబాద్: ప్రముఖ వంటనూనెల ఉత్పత్తిదారు గోల్డ్‌డ్రాప్ కొత్తగా ఒక్క లీటర్ పెట్ బాటిల్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. అన్ని భద్రతా చర్యలనూ పరిగణలోకి తీసుకుని వినియోగదారుల కోసం దీన్ని అందుబాటులోకి తెచ్చామని ఆ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా పేర్కొన్నారు. తమ సంస్థకు వినియోగదారుల భద్రత అత్యంత ప్రధానమైందన్నారు.. ఈ పెట్ బాటిల్స్‌లో ట్యాంపర్ ప్రూఫ్ సీల్స్, ఇతర అంశాలు ఉన్నాయన్నారు.