ఆర్థికంగా వెనుకబడిన షెడ్యూల్‌ కులాలు..

Economically Backward Schedule Castes..– వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించాలి : పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ
– వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రవీందర్‌రెడ్డి
– పెరటి కోళ్ల పంపిణీ
నవతెలంగాణ-షాబాద్‌
వెనుకబడిన షెడ్యూల్‌ కులాల వారు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించి, ఆర్థికంగా ఎదగాలని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రవీందర్‌రెడ్డి సూచించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని రేగడి దోస్త్వాడ గ్రామంలో ఎస్సీలకు వంద యూనిట్ల పెరటి కోళ్ళను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన షెడ్యూల్‌ కులాల వారు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. అందులోనే భాగంగా ఎస్సీలకు పెరటి కోళ్లను ఉచితంగా పంపిణీ చేసినట్టు చెప్పారు. రేగడి దోస్వాడ గ్రామాన్ని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ దత్తత తీసుకుంటుందని తెలిపారు.
ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సహాయ, సహకారాలు అయినా ఇక్కడ అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పెరటి కోళ్ల పెంపకంతో పాటు మేకలను ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, వీటిలో సైతం ఎస్సీలను భాగస్వాములను చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ రఘునందన్‌, అసోసియేట్‌ అధ్యాపకులు డాక్టర్‌ ఉదరు కుమార్‌, జంతు ప్రొఫెసర్‌ డాక్టర్‌ నర్సింహ, వెటర్నరీ కాలేజ్‌ న్యూట్రిషన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు గోపాలకృష్ణ, డాక్టర్‌ సత్యనారాయణ రాజు, డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్‌ పురుషోత్తం, డాక్టర్‌ యానిమల్‌, జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విజరుకు మార్‌, రేగడి పశువైద్యాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, పశవైద్య సిబ్బంది శ్రీను, సాగర్‌, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.