ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన ఐద్వా జిల్లా నాయకులు

నవతెలంగాణ- కంటేశ్వర్

నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం ఐద్వా జిల్లా కమిటీ సందర్శించడం జరిగింది. హాస్పటల్లో సందర్శిస్తున్న సమయంలో ఎక్కువమంది రోగులు కొన్ని మందులు అందిస్తున్నారు మరికొన్ని మందులు బయటకు రాసిస్తున్నారు అవి ఎక్కువ రేటు ఉండడంతో మేము కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేదే నిరుపేదలు వారికి బయట మెడిసిన్ రాసేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్ని రకాల రోగులు ఉన్నారో అన్ని రకాల మెడిసిన్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని అలాగే గర్భిణీ స్త్రీలు ప్రసవం కోసం ఆస్పత్రికి వస్తే వారితో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ప్రసవం కోసం వచ్చిన మహిళలతో ఓపికతో వారికి అర్థమయ్యే విధంగా సిబ్బంది చెప్పాలి అంతే తప్ప వారి పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని విమర్శించారు. వైద్యరంగం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని లేదంటే రానున్న కాలంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత జిల్లా ఉపాధ్యక్షురాలు లావణ్య జిల్లా నాయకురాలు రజియా నాయకులు కళావతి సంధ్య తదితరులు పాల్గొన్నారు.