
గాంధీభవన్లో నిజాంబాద్ పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశం సోమవారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి కర్ణాటక ఎమ్మెల్యే బి ఎం నాగారాజు పర్యవేక్షకునిగా రావడం జరిగింది.నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పిసిసి మెంబర్లు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,అనుభంగా విభాగాల జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిసిసి కాటేర్యనిర్వహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్,పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందన్,పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్,రూరల్ ఇంఛార్జి భూపతి రెడ్డి,పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ ఆరికేల నర్సారెడ్డి,రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి,నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ,పిసిసి అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బి ఎం నాగరాజు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్లాలని దిశ నిర్దేశం చేశారు.ఈ నెల 12,13,14 తేదీలలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటుచేయడం జరుగుతుందని ఆయన సూచించారు.