వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నగర అధ్యక్షులుగా షేక్ ఇబ్రహీం

– ప్రధాన కార్యదర్శి ధ్యారంగుల కృష్ణ, 15 మందితో కార్యవర్గం ఎన్నిక
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నూతన కార్యవర్గాన్ని, నాందేవ్ వాడలో జరిగిన విస్తృత సమావేశంలో 15 మందితో నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా మల్యాల గోవర్ధన్, అధ్యక్షులు షేక్ ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శి ధ్యారంగుల కృష్ణ, కోశాధికారి నల్వాల నరసయ్య, ఉపాధ్యక్షులు మునీర్ అహ్మద్, భాస్కర్, అఖిల్, సహాయ కార్యదర్శులు మునావర్, సునీత, గురు స్వామి, కమిటీ సభ్యులు రిజ్వాన్, శోభ, మునావర్, నిజాముద్దీన్, తిమ్మయ్య తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.