వర్షం కారణంగా వాహనాల బహిరంగ వేలం వాయిదా

నవతెలంగాణ- కంటేశ్వర్
ప్రజలకు తెలియజేయునది ఏమనగా నిజామాబాద్ పోలీస్ కమీష నరేటు పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించి వీదులలో ఆచూకీ లేకుండా వదిలివేసి వెళ్లిన వివిధ రకములైన మోటార్ సైకిళ్లు, ఆటోలు మొత్తం (226) వాహనాలను పోలీస్ లైన్, ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు నందు తేది 6-9-2023 నాడు ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలియజేయడం జరిగిందని దానిని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ఇట్టి వేలం నిర్వహణ తేది:6-9-2023 న నిర్వహించడం లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి పత్రికా ప్రకటన మంగళవారం విడుదల చేశారు. ఈ వేలం నిర్వహణ మళ్లీ నిర్వహిస్తామని అప్పుడు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. కావున నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ గమనికను తప్పకుండా గమనించగలరు అని కోరుతున్నామన్నారు.