‘నాదెండ్ల’ది నిబద్ధత కలిగిన జీవితం

'Nadendla' is a committed life– సంతాప సభలో కొనియాడిన పలువురు
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ ప్రముఖులు కీర్తిశేషులు నాదెండ్ల వెంకటేశ్వరరావు నిబద్ధత కలిగిన జీవితంతో పాటు తన తోటి వారిని ఎంతోమందిని వృత్తిపరంగా అభివృద్ధి చేసిన ఆయన జీవితం ధన్యమైందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు, భద్రాచలం ఎమ్మెల్సీ పొందెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) నాయకులు కాసాని ఐలయ్య, ఏజే రమేష్‌, కొండపల్లి పవన్‌, అన్నవరపు సత్యనారాయణ, దొడ్డ రవికుమార్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కోనేరు సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని మథర్‌ తెరిసా బీఈడీ కళాశాల ప్రాంగణంలో నాదెండ్ల సంతాప సభ ఘనంగా జరిగింది. అతిథులకు నాదెండ్ల కుమారుడు వర కిషోర్‌, నాదెండ్ల అపర్ణ, కుమార్తె వనలత, అల్లుడు డాక్టర్‌ బిక్కసాని, డాక్టర్‌ సుధాకర్‌ రావులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించి సంతాప సభలో వారు మాట్లాడారు. తనతోపాటు ఎంతో మందికి వ్యాపార బాధ్యతలను అప్పగించి ఎన్నో కుటుంబాలను పై స్థాయికి తీసుకురావడం జరిగిందని అన్నారు. పాల్వంచలో వర్తక సంఘాన్ని స్థాపించ డంతోపాటు కళాకారులకు ఎంతో సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ కొత్తగూడెం నుండి వైద్యులు డాక్టర్‌ రమేష్‌ బాబు, డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ ముక్కంటేశ్వరరావు, డాక్టర్‌ బుచ్చయ్య, పాల్వంచ, కొత్తగూడెం ప్రముఖులు పాల్గొన్నారు.