నవతెలంగాణ-చేవెళ్ల
వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్‌లో సోమవారం కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం ఆధ్వర్యంలో డీసీసీ మాజీ అధ్య క్షులు పడాల వెంకటస్వామి పరిశీలించారు. హాస్పి టల్‌లో 11 మంది వైద్యులకు ఒక్కడే కాంట్రాక్టు డాక్టర్ ఉండడంతో ఓపి పేషెంట్లకు అవస్థలు పడుతున్న దృశ్యాన్ని పరిశీలించారు. వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. 11 మంది వైద్యులకు గాను ఒక్కరే డాక్టర్ ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులు అవస్థలు పడుతూ వివిధ రోగాల భారీన పడే హాస్పిటల్‌ను సందర్శిస్తే, స్పెషలిస్టులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణులు రోగులను చూసేనాధులే లేకపోవడంతో ఆందోళన పడ్డారు. మేల్, ఫిమేల్ వార్డులో ఒకే దగ్గర ఉంచి ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. డిప్యూటేషన్ పై వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన డాక్టర్లను వెంటనే రప్పించాలని డీసీ హెచ్‌ఓకు సున్నపు వసంతం ఫోన్లో సూచించారు. ఫార్మసిస్ట్ సరైన టైంలో రాక రోగులకు మందులు ఇవ్వక చాలా ఇబ్బం దులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్ వైద్యుల తీరు అగమ్యగో చరంగా ఉందని, వారం రోజుల్లో వారి పరిస్థితి మెరుగుపడకపోతే ఆందోళన పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు ఆయన వివరించారు.
చేవెళ్ల ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్ అగమ్మ గోచరంగా ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే పట్టించుకోక పోవడం మరింత దారుణంగా ఉందని, 100 పడకలా హాస్పిటల్లో అప్‌డెట్ చేస్తామని చెప్పి, ఎన్నికల హామీలిఇచ్చి దాని ఊసే ఎత్తకుండా కాలం వెళ్లదిస్తున్నారని ఎమ్మెల్యే పై మండిపడ్డారు. 50 పడకల ఆస్పత్రిని ఎమ్మెల్యే తీరు పట్ల 30 పడకల ఆస్పత్రికి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల గ్రామ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, చేవెళ్ల ఎంపీటీసీ సభ్యులు గుం డాల రాములు, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెంటయ్యగౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శెట్టి మధు సూదన్‌గుప్తా, చేవెళ్ల వార్డు మెంబర్ మల్గారి మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు జుకన్న గారి శ్రీకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు పాండు యాదవ్, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షులు బి.శ్రీనివాస్, సోషల్ మీడియా చేవెళ్ల నియోజకవర్గం కో కన్వీనర్ మాణిక్యం, మైనారిటీ జిల్లా కార్యదర్శి మహమ్మద్ హనీఫ్, న్యాలట మాజీ సర్పంచ్ బాలయ్య, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్య క్షులు బండారు వెంకటరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.