శిథిలాల మధ్య కదిలే శిశువు..!

A baby moving among the ruins..!ఇద్దరు వ్యక్తుల రాగ ద్వేషాల వల్ల
యుద్ధ భేరి భీకరంగా మోగింది..!
కొందరి శక్తులు మద్దతుతో
సమరం హోరాహోరీగా కొనసాగుతోంది!!
ఇజ్రాయిల్‌- పాలస్తీనాల మధ్య
ఇంతకాలం ప్రచ్చన్న పోరాటం వుండగా
నేడు ప్రత్యక్ష యుద్ధం జరుగుతోంది…!?
ఇరు దేశాల ప్రజలు సైతం
అర చేతిలో ప్రాణాలు పెట్టుకొని
ప్రియమైన దేవుడిని ప్రార్థిస్తున్నారు..!
ఉరిమేటి యుద్ధ మేఘాలు
శిఖరాల నగరాలు చుట్టూ కమ్ముకుంటున్నాయి..!
అగ్నిని మండించిన ఆగేయాస్త్రాలు
పురముల శిరస్సులు ఖండించిన పాశు పతాస్త్రాలు
విరజిమ్మిన అమ్ముల పొదిలోని మారణాయుధాలు..!
నాజూకైన నగరాలు కుప్పకూలే..!
పట్టణాలు ధ్వంసమై చెత్త కుప్పలాయె..!!
తాగు నీరు ఎర్రగా మారె..
గోరుముద్ద రుధిరమాయే..!
శిథిలాల మధ్య మెల్లగా కదిలే శిశువు
శకలాల నడుమ వికలమైన దేహాలు
ఇద్దరి మధ్య పుట్టిన కుటిల యుద్ధానికి
వేలాది మంది ప్రజలు నరబలి కావాల్సిందేనా…!!??

– జి.సూర్యనారాయణ, 6281725659