తృటిలో తప్పిన పెను ప్రమాదం

– శంకర్‌పల్లి బాలికల హాస్టల్‌లో మీటర్‌పేలి మంటలు
– అర్ధరాత్రి బయటకు పరుగులు తీసిన విద్యార్థులు
– పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు
– విద్యార్థులకు రక్షణగా నిలిచిన పోలీసులు, స్థానిక ఆలయంలో ఆశ్రయం
– ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు
– పాఠశాల ఎదుట శుక్రవారం విద్యార్థి సంఘాల ఆందోళన
– బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌
నవతెలంగాణ-మొయినాబాద్‌
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండ లంలోని శంకర్‌పల్లి సాంఘిక సంక్షేమ బాలిక ల గురుకుల పాఠశాలలో గురువారం అర్ధరా త్రి పెను ప్రమాదం తప్పింది. హాస్టల్‌లో షార్ట్‌ సర్య్కూట్‌తో విద్యుత్‌ మీటర్‌ పేలి మంటలు అంటుకున్నాచి. పెద్ద శబ్దాలతో మంటలు చెల రేగడం విద్యార్థులు భయాందోళనలకు గుర య్యారు. వెంటనే భయంతో హాస్టల్‌లోని 580 మంది విద్యార్థులు బయటికి పరుగులు తీశా రు. హాస్టల్‌ దగ్గరలోని పోలీసుస్టేషన్‌కు విద్యా ర్థులు వెళ్లి జరిగిన విషయం తెలిపారు. దాం తో సీఐ వెంకట్‌ చొరవ తీసుకుని విద్యార్థులకు రక్షణ కల్పించారు. పక్కన ఉన్న దేవాలయంలో వారికి ఆశ్రయం కల్పించారు. విద్యుత్‌ సిబ్బం దికి ఫోన్‌ చేసి ప్రమాద పరిస్థితులు పరిశీ లించారు. అనంతరం తమ కు అందుబాటులో ఉన్న బ్యాటరీలను హాస్టల్లో పెట్టించి ఉదయం వరకు విద్యార్థులకు రక్షణగా ఉన్నారు. దాం తో విద్యార్థులు ఊపిరి పీల్చు కున్నారు. విద్యా ర్థులకు రక్షణగా నిలిచిన పోలీ సులకు విద్యార్థు లు, తమ తల్లీదండ్రులు కృతజ్ఞతలు తెలి పారు.
విద్యార్థులకు ఎమ్మెల్యే పరామర్శ
శుక్రవారం ఉదయం హాస్టల్‌ ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పీ హాస్టల్‌ వచ్చి విద్యార్థులను పరామర్శించారు. విద్యుత్‌ అధికారులకు, హాస్ట ల్‌ ప్రిన్సి పాల్‌కు సూచనలు చేశారు. భవిష్యత్‌ ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. భారీ వర్షాలకు జాగ్రత్తలు పాటించక నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం, హాస్టల్‌ ఎలక్ట్రీషియన్‌ తరుచుగా హాస్టల్లో విద్యుత్‌ పరికరాలను పర్యవేక్షిం చకపోవడం ప్రమాదాలకు కారణాలని, అధిక లోడ్‌ భారంతో ప్రమా దం సంభవించిందని విద్యుత్‌ అధికారులు తెలిపారు. విద్యుత్‌ అధికారులకు హాస్టల్‌ సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రిన్సిపాల్‌ తెలిపారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
హాస్టల్‌లో ప్రమాదం జరగడాన్ని నిరసి స్తూ శుక్రవారం కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ప్ర యోజకులు అవుతారని ఆశించి హాస్టళ్లలో ఉంచి చదివిస్తే వారికి కనీస రక్షణ, వసతులు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి, హై దరాబాద్‌ ప్రాంతీయ సమన్వయ అధికారి శార దావెంకటేష్‌, ప్రిన్సిపాల్‌ జయమ్మను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక హాస్టల్‌ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండటం, కిటి కీలకు తలుపులు లేకపోవడం, మూత్ర శాలలు పూర్తి దుర్గంధంతో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికై నా విద్యార్థులకు నాణ్యమైన విద్యా, ఆహారం, వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్‌ అధ్య క్షుడు బెగారి అరుణ్‌, సీపీఐ జిల్లా కార్య వర్గ సభ్యులు కె.రామస్వామి, సీపీఐ మండల కార్యదర్శి కె.శ్రీనివాస్‌, తల్లిదండ్రులు పాల్గొన్నారు.