నవదీప్ హీరోగా నటించిన ‘లవ్ మౌళి’. అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ,’నా ఆలోచన విధానానికి, నేను చేయాలనుకుంటున్న సినిమాలకు ఈ సినిమా దగ్గరగా అనిపించింది. అందుకే మీ ముందుకు సరికొత్త చిత్రంతో రాబోతున్నాను’ అని చెప్పారు. ‘నా లైఫ్‌లో జరిగిన ప్రేమకథలకు ఫలితమే ఈ సినిమా కథ. నా స్వీయ అనుభవాలే ఈ సినిమా కథ’ అని దర్శకుడు అవనీంద్ర అన్నారు.
‘నేను ఛాలెంజింగ్‌గా చేసిన సినిమా ఇది. నా లైఫ్‌లో నేను చేయలేను అనుకున్న సాహసాలు అన్నీ ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో చేశాను. ప్రేమ గురించి ఎంతో నిజాయితీగా బ్యూటీఫుల్‌గా చెప్పిన లవ్‌స్టోరీ ఇది’ అని కథానాయిక పంఖురి గిద్వానీ చెప్పారు. భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన -దర్శకత్వం, సినిమా టోగ్రఫీ, ఎడిటింగ్ : అవనీంద్ర, సంగీత దర్శకులు: గోవింద్ వసంత.