సరికొత్త సుధీర్‌ని చూస్తారు

సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘కాలింగ్‌ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్‌, రాధా ఆర్ట్స్‌ పతాకాలపై అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్‌ సరసన డాలిశ్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల ‘కలయా నిజమా..’ అనే లిరికల్‌ సాంగ్‌ను సినీ పాత్రికేయుల చేతుల మీదుగా రిలీజ్‌ చేశారు.
ఈ సందర్భంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ మోహిత్‌ రెహమానిక్‌ మాట్లాడుతూ, ‘మా సినిమాలో ‘కలయా నిజమా..’ అనే మెలోడీ సాంగ్‌ పాడిన చిత్రకి థ్యాంక్స్‌. అందరికీ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను” అన్నారు. ‘నిర్మాతలుగా ‘కాలింగ్‌ సహస్త్ర’ మా తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్‌ మెమొరీ. మోహిత్‌ అద్భుతమైన ట్యూన్‌ ఇవ్వగా, లిరిసిస్ట్‌ లక్ష్మీ ప్రియాంక అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు’ అని నిర్మాత వెంకటేశ్వర్లు కటూరి చెప్పారు. నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ, ”కథలోని ట్విస్టులు, టర్నులు ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయి. ఫస్ట్‌ సీన్‌ నుంచి ఈ సినిమా ఎంగేజింగ్‌ చేస్తుంది. ఈ మూవీ నటుడుగా సుధీర్‌లోని కొత్త షేడ్‌ను చూపిస్తుంది’ అని తెలిపారు. దర్శకుడు అరుణ్‌ విక్కిరాలా మాట్లాడుతూ, ”కలయా నిజమా’ పాటకు మోహిత్‌ ట్యూన్‌ వినగానే నచ్చింది. చిత్ర పాడిన తర్వాత ఆ పాటకు మరింత అందం వచ్చింది. సుధీర్‌ కంప్లీట్‌ డిఫరెంట్‌గా కనిపిస్తారు’ అని అన్నారు. హీరో సుధీర్‌ మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా డిఫరెంట్‌ జోనర్‌లో చేసిన సినిమా ఇది. శివ బాలాజీ మంచి సపోర్ట్‌ అందించారు. నన్ను నమ్మి ఈ సినిమా చేస్తున్న దర్శక, నిర్మాతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’ అని చెప్పారు.