రేవంత్‌ రెడ్డిపై కేసు నమోదు

– పోలీసులపై అనుచిత వ్యాఖ్యలే కారణం
– జిల్లా పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గుణవర్ధన్‌ ఫిర్యాదు
నవతెలంగాణ- కందనూలు
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డితో పాటు ఇద్దరు కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలపై నాగర్‌కర్నూల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు జిల్లా ఎస్పీ మనోహర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో రేవంత్‌ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానకరంగా మాట్లాడినందుకు జిల్లా పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గుణవర్ధన్‌ ఫిర్యాదు మేరకు రేవంత్‌ రెడ్డిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, వంశీచంద్‌ రెడ్డిపై కూడా కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. గుణవర్ధన్‌ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ 313/2023, ప్రకారం సెక్షన్‌ 153,609 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేసినట్టు పెర్కొన్నారు.