– ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలి
– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం అమలు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు కోరారు. శుక్రవారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉపాధి పని వ్యవసాయ కూలీలకు మార్చి, ఏప్రిల్, మే నెలలో జీవనాధారంగా ఉంటుందని, 2005లో వామపక్షాల ఎంపీల పోరాట ఫలితంగా వ్యవసాయ కూలీల పోరాట ఫలితంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చిందని, కాని కేంద్రంలో అధికారం చేస్తున్న బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాడని, నిధులు తగ్గిస్తున్నాడని, రెండు లక్షల 50 వేల కోట్లు ఉన్న నిధులను నేడు 63 వేల కోట్లు మాత్రమే కేటాయించాడని, 100 రోజులు సాగాల్సిన అది పని కేవలం 30, 40 రోజులు మాత్రమే సంవత్సరానికి సాగుతున్నదని, కూలి కూడా రోజుకి రూపాయలు 272 చట్టం ప్రకారం ఇవ్వాలని, కాని 200 రూపాయలు వంద రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు .రోజురోజుకు ఈ ఉపాధి పనిపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని, దీని కారణంగా కోట్లాదిమంది కూలీలు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, తాళ్లపల్లి కృష్ణ, పి.సంగయ్య, కె.వి.రెడ్డి, టి రాధాకృష్ణ, వత్సవాయి జానకిరామ్, గద్దల రత్తమ్మ, ప్రతాపనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.