గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
నవతెలంగాణ-కుల్కచర్ల
మండలం దాస్యనాయక్ తండా సమీపంలో బీటీ ప్రమాదకరంగా మారిందని వెంటనే మరమ్మతులు చేయిం చాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం గిరిజన సంఘం నాయకులతో కలిసి ప్రమాదకరంగా మారిన గుం తను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ…రాత్రి సమయాల్లో వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది గా మరిందని గతంలోనూ ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతిని ధులు స్పందించి రోడ్డును బాగు చేయాలని లేని యెడల ఆందోళన చేస్తామని ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. గిరిజన విద్యార్థి సంఘం పరిగి మండల అధ్యక్షులు అధ్యక్షులు అనిల్ నాయక్, ప్రవీణ్ నాయక్, శం కర్ నాయక్, అరవింద్ నాయక్, భిన్న నాయక్, కుమార్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.