నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ప్రజారోగ్య విభాగం, వైద్య విధాన పరిషత్‌లలో పనిచేస్తున్న పీజీ పూర్తయిన వైద్యుల సమావేశం శుక్రవారం జరిగింది. పీజీ పూర్తయిన తర్వాత వారిని డీఎంఈ బోధన విభాగంలోకి జీవో నెంబర్ 154 ప్రకారం తీసుకోవాలని ఉన్నా, ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమావేశంలో చర్చించారు. ఈనెల 31వ తేదిలోపు దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న మరొకమారు సమావేశమై ప్రభుత్వ వైద్యుల సమస్యలపై చర్చించనున్నట్లు ప్రభుత్వ వైద్య సంఘం ప్రతినిధుల బందం తెలిపింది.