అలరించిన యూరోపియన్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌

944007749929 భాషల్లో.. 12మంది మహిళా నిర్మాతలు.. 24 అవార్డు చిత్రాలు హైదరాబాద్‌ వేదికగా డిసెంబర్‌ 6 వ తేది నుండి 15 వ తేది వరకు పది రోజుల పాటు సారథి స్టూడియోస్‌, హైదరాబాద్‌ ఫిలిమ్‌ క్లబ్‌ సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రసాద్‌ లాబ్స్‌లో నిర్వహించిన 29వ యూరోపియన్‌ యూనియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ విజయవంతమయింది. పది రోజులపాటు జరిగిన ఈ పండగ సినీ అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫెస్టివల్‌లో స్వీడన్‌, ఉక్రెయిన్‌ తదితర ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో గుర్తింపు పొందిన ఆలోచనాత్మకమైన క్యూరేటెడ్‌ చిత్రాల ఎంపికలో పేరున్న కొన్ని యూరోపియన్‌ చలనచిత్రాలు ఉన్నాయి.
ఈ చిత్రోత్సవంలో బెల్జియం, ప్రాన్స్‌, గ్రీస్‌, జర్మనీ, బల్గేరియా, సైప్రస్‌, చెకియా, డెన్మార్క్‌, ఎస్టోనియా, హంగేరీ, ఐర్లాండ్‌, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్‌, మాల్టా, నెదర్ల్యాండ్స్‌, పోలాండ్‌, పోర్చుగల్‌, రొమేనియా, స్లోవేనియాలో నిర్మితమైన ‘లా చిమేరా’, ‘బాన్‌’, ‘జిమ్స్‌ స్టోరీ’, ‘యానిమాల్‌’, ‘యాన్‌ ఐరిష్‌ గుడ్‌ బై’, ‘అపైర్‌’, ‘రిస్టోర్‌ పాయింట్‌’, ‘ది మ్యాన్‌ వితౌట్‌ గిల్డ్‌’, ‘ది టీచర్‌ హూ ప్రామిస్డ్‌’, ‘ది సీ’ వంటి ఎన్నో ప్రశంసలు పొందిన అద్భుత చిత్రాలు, ఆకర్షణీయమైన కథలు, నటుల అద్భుతమైన నటన, విజువల్స్‌, యూరోపియన్‌ సమాజం, సంస్కతి, ప్రకతి దశ్యాలు, మానవ భావోద్వేగాలు, ధక్కోణాలను ఆవిష్కరించి సినీ ప్రియులను అలరించాయి.
ఈ చిత్రోత్సవ ప్రారంభ చిత్రంగా ప్రదర్శించిన 77 వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో వరల్డ్‌ ప్రీమియర్‌తో సందడి చేసిన కామెడీ, డ్రామా ”జిమ్స్‌ స్టోరీ” ఫ్రెంచ్‌ చిత్రం మానవ సంబంధాలు, పితత్వం, జీవితంలో ఎదురైన సంక్లిష్టతలను పరిష్కరించుకునే దిశగా సాగి వీక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. సమకాలీన యూరోపియన్‌ సినిమాను ”బికాస్‌ ఐ లవ్‌ బ్యాడ్‌ వెదర్‌, స్టేయిర్‌ వే టు హెవెన్‌, డెత్‌ ఈజ్‌ ఎ ప్రాబ్లమ్‌, జిమ్స్‌ స్టోరీ, వితౌట్‌ ఎయిర్‌, బ్లాక్‌ వెల్వెట్‌, ది లాస్ట్‌ యాషెస్‌, బ్లడ్‌ ఆన్‌ ది క్రౌన్‌, బాన్‌, హొరియా, ది మ్యాన్‌ వితౌట్‌ గిల్ట్‌” చిత్రాలు అక్కడి వ్యక్తులు, ప్రేమ, సంస్కతుల గురించి కొత్త అనుభూతులను ఆవిష్కరించాయి.
చిత్రోత్సవం ప్రారంభం
వివిధ దేశాల ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ ఈ నేల మీద నిర్వహించడం ద్వారా ఇక్కడి సినీ ప్రియులు, కొత్తగా ఇండిస్టీకి వచ్చేవారు ఆయా దేశాల జీవన సంస్కతితో పాటు సినీ నిర్మాణంలోని మెళకువలను తెలుసుకునే అవకాశం వుంటుందని ఇలాంటి ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ రెగ్యులర్‌గా జరగాల్సిన అవసరముందని, తెలుగు సినిమా ఇండిస్టీతో పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరమని అతిథులు అన్నారు.
29వ యూరోపియన్‌ యూనియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాత సి.కళ్యాణ్‌, డైరక్టర్స్‌ అసొసియేషన్‌ వీర శంకర్‌, దర్శకుడు రేలంగి నరసింహారావు, సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ ఫిల్మ్‌ క్లబ్‌ అధ్యక్షులు కె.వి.రావు, సెక్రెటరీ ప్రకాష్‌ రెడ్డి, కరీంనగర్‌ ఫిల్మ్‌ సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర, డైరక్టర్స్‌ అసొసియేషన్‌ కార్యదర్శి సుబ్బారెడ్డితో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు.
పొన్నం ర‌విచంద్ర‌ 9440077499