స్వయంభూ..

హీరో నిఖిల్‌ తాజాగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం విదితమే. ఇది నిఖిల్‌ నటిస్తున్న 20వ చిత్రం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి ‘స్వయంభూ’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు మేకర్స్‌. ఠాగూర్‌ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌పై భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. ఈ ఫస్ట్‌-లుక్‌ పోస్టర్‌లో నిఖిల్‌ యుద్ధభూమిలో పోరాట యోధుడిలా కనిపించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌ ఫస్ట్‌లుక్‌తో క్యూరియాసిటీని క్రియేట్‌ చేసింది. నిఖిల్‌ కెరీర్‌లోనే అత్యంత భారీగా, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందనుంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌, డీవోపీ : మనోజ్‌ పరమహంస, సహ నిర్మాతలు: విజరు కామిశెట్టి,జిటి ఆనంద్‌.

Spread the love