నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36 బిగ్గిస్ బర్గర్ షాపులో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా షాపులో పొగలు కమ్ముకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చినట్టు తెలిపారు. పక్కనే పెట్రోల్‌బంక్ ఉండటంతో స్థానిక ప్రజలు కొద్ది సేపు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీస్ అధికారులు పెట్రోల్ బంక్‌ను మూయించి, తమ సమాచారం అందించాకే తిరిగి పెట్రోల్ బంకులు ప్రారంభించాలని కోరారు. ప్రాణం నష్టం జరగలేదని, ఆస్తి నష్టం కొంతమేరకు జరిగిందన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందో పూర్తి వివరాలు తెలిసిన వెంటనే వివరాలు వెల్లడిస్తామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెెలిపారు.