సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ-కరకగూడెం
ప్రతీ మూడు నెలలకు ఒక్కసారి గ్రామీణా ప్రాంతల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలగు అంశాలపై నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదా సీదాగా సాగింది. మంగళవారం మండల కేంద్రంలో మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ రేగా కాళిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీలో ప్రజలు ఎందుర్కొంటున్న విద్యుత్‌, ఉపాధి హామీ, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలగు అంశాలపై సంబంధిత అధికారులు సర్పంచ్‌ల ఎదుట వారివెంట తెచ్చుకున్న సమాచారన్ని చదివి వినిపించారు. పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ మన ఊరు-మన బడి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్లు నిర్మాణ పనులకు వాటర్‌ క్యూరింగ్‌ కూడా చేయడం లేదని సర్పంచులు వాపోయారు. వెంటనే స్పందించి ఎంపీపీ రేగా కాళికా సంబంధిత శాఖ ఏఈ ని వివరణ కోరారు. ఏఈ సకృ మాట్లాడుతూ ఇంత వరకు తన దృష్టికి ఈ విషయం రాలేదని అన్నారు. పనుల్లో ఆలసత్వం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పలు అంశాలపై వ్యవసాయ, విద్యుత్‌, కార్మిక, వైద్య, పంచాయతీ రాజ్‌, మీషన్‌ భగీరథ, విద్య పలు శాఖ అధికారులు మండలంలో జరుగుతున్న పనుల వివరాలు తెలిపారు. స్పందించిన ఎంపీపీ సమావేశానికి రాని అధికారుల వివరణ తెలుసుకోవాలని ఎంపిడిఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహశీల్దార్‌, ఎంపిటిసిలు, సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.