జయశంకర్‌ను మరిచిన ప్రభుత్వం

తెలంగాణ జన సమితి తాండూరు నియోజకవర్గం ఇన్‌చార్జి సాంబూరు సోమశేఖర్‌
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో బుధవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్థంతి సందర్భంగా ఇంద్రాచౌక్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహం వద్ద తెలం గాణ జన సమితి, విద్యావంతుల వేదిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జయశంకర్‌ సార్‌ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపాల్‌ కౌన్సిలర్‌ సాం బురు సోమశేఖర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్‌ ఆశయాలకు వ్యతిరేకంగా పాలన కొన సాగిస్తుందని, రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్న మేధావులు మౌనం వహించడం చాలా బాధాకరమన్నారు. మేధావుల మౌనం ప్రజాస్వామ్య ఉనికే ప్రమాదమని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో బలిదానాల ద్వారా తెచ్చు కున్న రాష్ట్రంలో నేడు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అమరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పెత్తందారీల చెప్పుచేతల్లో పాలన కొనసాగుతుందని, ఉద్యమ ద్రోహులు పదవులు పొందుతూ, ఎవరైతే ఆనాడు ఉద్యమకారుల పైన కాల్పులు దాడులు జరిపిన వారు నేడు అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించడం యావత్‌ తెలంగాణ పోరాట స్ఫూర్తికే అవమానమన్నారు. జయశంకర్‌ కలలుగన్న తెలంగాణ ఇది కాదనీ ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ అభివృద్ధికి ఉద్యమించారని తెలిపారు. తెలంగాణ విజయవంతుల వేదిక నాయకులు పర్యాద రామకష్ణ మాట్లాడుతూ దశాబ్ద ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్‌కు తగిన గౌరవ ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జీలకర్ర రవీందర్‌, జన సమితి నాయకులు నూరుద్దీన్‌, గౌరీ, సందీప్‌, అరుణ్‌ ,మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.