నవతెలంగాణ-పూడూర్
పూడూరు మండల కేంద్రంలో ఆదివారం ఏరువాక పండగ సందర్భంగా జోడెడ్లతో రంగులతో ఎంతో అందంగా అలంకరించి గ్రామంలో ర్యాలీగా సోమేశ్వరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి గ్రామంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామస్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. కార్యక్రమంలో యువకులు రాఘవేందర్ రెడ్డి, సిద్దులూరి శ్రీనివాస్, ప్యాట శేఖర్, మంగలి సత్యనారాయణ, మాసగాళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.