– ప్రారంభించిన అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ వంటేరు ప్రతాపరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్‌లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాయామశాలను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ వంటేరు ప్రతాపరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సందర్శకుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రెండేండ్లలో బొటానికల్ గార్డెన్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. వైస్‌చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ..మూడు నెలల కిందట బొటానికల్ గార్డెన్ పనులను పర్యవేక్షించే సమయంలో ఓ సీనియర్ సిటిజెన్ జిమ్ ఏర్పాటును ప్రస్తావించారన్నారు. వెంటనే వారికి అనుగుణంగా ఉండే జిమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్, డైరెక్టర్ ఎం.జె. అక్బర్, జీఎం రవీందర్ రెడ్డి, ఓఎస్‌డీటీపీ తిమ్మారెడ్డి, సీనియర్ డీఎం, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి. స్కైలాబ్, ఎకో టూరిజం ప్రాజెక్టు మేనేజర్ సుమన్, ప్లాంటేషన్ మేనేజర్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, హాజీ బాషా, సీనియర్ సిటిజెన్స్ ఎకోటూరిజం సిబ్బంది, టీఎస్‌ఎఫ్‌డీసీ సిబ్బంది పాల్గొన్నారు.