ఆధ్యాత్మిక దినోత్సవ మహోత్సవా కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి రావాలి

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యం లో ఈనెల 21న బుధవారం మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించే ఆధ్యాత్మిక దినోత్సవ మహోత్సవానికి భారీ ఎత్తున తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వై గోవింద్ మండల ప్రజలను కోరారు ఆధ్యాత్మిక దినోత్సవ మహోత్సవాలు నిర్వహించే కరపత్రాలను ఆయన ఆధ్వర్యంలో మండలంలోని మేనూర్ గ్రామంలో మంగళవారం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ నెంబర్ నిజాముద్దీన్ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.