కులవృత్తుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి లక్ష రుణం ఇవ్వాలి

నవతెలంగాణ-మర్పల్లి
కుల వృత్తుల కింద ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయల రుణం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ జాయింట్‌ కన్వీనర్‌ ఎం ఈశ్వర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన బీసీ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కష్ణయ్యను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కులాల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తు న్నాయని ఉద్యమిస్తే తప్ప తమకు ప్రభుత్వ పథకాలు దక్కడం లేదన్నారు. బీసీల జనాభాకు అనుగుణంగా రాజకీయ అవకాశాలు లభించడం లేదని ఆరోపించారు. బీసీలందరూ ఐక్యతతో ఉద్యమాలు చేసి తమ హక్కులు సాధించుకోవాలన్నారు. కార్యక్రమంలో మర్పల్లి మండల్‌ అధ్యక్షులు ఎండి ఫయాజ్‌, విద్యార్థి నాయకుడు మారుతి, ఎండీ ఇలియాజ్‌ తదితరులున్నారు.