భిన్న కథతో మిస్టేక్‌

‘రామ్‌ అసుర్‌’ సినిమాతో హీరోగా కూడా మెప్పించిన అభినవ్‌ సర్దార్‌ తాజాగా ‘మిస్టేక్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొరియోగ్రాఫర్‌ భరత్‌ కొమ్మాలపాటి దర్శకత్వంలో అభినవ్‌ సర్దార్‌ హీరోగా ఆయన సొంత నిర్మాణంలో ఎఎస్‌పి బ్యానర్‌ పై ఈ సినిమా రూపొందుతోంది.
పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను పూర్తి చేసుకుని రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. లేటెస్ట్‌ గా ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు హీరో శ్రీకాంత్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’ఈ సినిమా మీద సర్దార్‌కి మంచి కాన్ఫిడెన్స్‌ ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్‌ అవుతుంది’ అని తెలిపారు. ‘డైరెక్టర్‌ భరత్‌ కథ చెప్పగానే ఈ సినిమాకు ఓకే చెప్పాను. అందర్నీ మెప్పించే సినిమా ఇది. ఇందులో కథ, కథనం, పాత్రలు అన్ని మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేస్తాయి’ అని హీరో, నిర్మాత అభినవ్‌ సర్దార్‌ అన్నారు.
డైరెక్టర్‌ భరత్‌ కొమ్మాలపాటి మాట్లాడుతూ,’ఈసినిమా నెక్స్ట్‌ మంత్‌ రానుంది. అందరి సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం అని గర్వంగా చెప్పగలను’ అని తెలిపారు.
సంగీత దర్శకులు ఆర్‌.పి. పట్నాయక్‌ ఒక సాంగ్‌ లాంచ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ,’డైరెక్టర్‌ భరత్‌ క్రియేటివిటీ బాగుంటుంది. పాట చాలా బాగుంది. సర్దార్‌కి ఈ సినిమాతో హిట్‌ ఖాయం’ అని తెలిపారు.