
ప్రమాదవశాత్తు బైక్ చెట్టును ఢీకొట్టడంతో తల్లి, కొడుకు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమీపంలో తాడ్వాయి వస్త్ర మధ్యలో 163వ జాతీయ రహదారి పై సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్నది ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. వివరాల్లోకెళ్తే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన సునారికాని(కావిరి) రమాదేవి(43), సునారికాని స్టీవెన్(19) అనే తల్లి కొడుకులు ములుగు జిల్లా కేంద్రంలో పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో తాడ్వాయి-పస్రా మధ్యలో జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఉన్న చెట్టును అదుపుతప్పి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి సునారికాని(కావిరి) రమాదేవి బుట్టాయిగూడెంలో అంగన్వాడి టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. అంగన్వాడి టీచర్ రమాదేవి, కొడుకు శ్రీవాన్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏటూర్ నాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.