అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్‌హొరాజ్‌పుత్ నటించిన సినిమా ‘మంగళవారం’. ఈనెల 17న పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అజయ్ భూపతికి చెందిన ‘ఎ’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామ్యంతో ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాలో మాస్క్ వెనుక ఉన్నది ఎవరు? అని విడుదలకు ముందు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగింది. విడుదలైన తర్వాత చూసిన ప్రేక్షకులు సైతం ఆ ట్విస్ట్ రివీల్ చేయలేదు. మాస్క్ వెనుక ఉన్న నటుడు, మాలచ్చిమ్మ పాత్రలో నటించిన ప్రియదర్శి అని రివీల్ చేశారు. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ప్రియదర్శికి ఉన్న మాస్క్‌ని విశ్వక్ సేన్ తీశారు.హొ విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ”ఆర్‌ఎక్స్ 100′, ‘మహాసముద్రం’, ఇప్పుడీహొ’మంగళవారం’… ఒక్క మాటలో మాట్లాడుకునే పాయింట్ తీసుకుని రెండున్నర గంటలు నిజాయతీగా చెప్పేహొదర్శకుడు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వానికి నేను పెద్ద ఫ్యాన్. పాయల్ బాగా చేశారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమానుహొఇంత క్వాలిటీగా తీయాలంటేహొనిర్మాతలు దొరకడం తక్కువ. నిర్మాతలకు హ్యాట్సాఫ్’ అని అన్నారు.
‘లేడీస్ చాలా మంది సినిమా గురించి ఆర్టికల్స్ రాస్తూ సోషల్ మీడియాలో నన్ను ట్యాగ్ చేస్తున్నారు. ఎవరూహొట్రై చేయనిదిహొచేశానని, టేకింగ్‌హొనెక్స్ట్ లెవల్ అని చెబుతున్నారు. అన్నిటికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యింది ఏమిటంటే… పాయల్ క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకుంటారా? రిసీవ్ చేసుకుంటారా? అని మొదట్లో కొంచెం భయపడ్డా. అయితే ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు చాలా అప్డేట్ అయ్యి ఉన్నారని మరొక్కసారి నిరూపితం అయ్యింది. మహిళలు అందరూ వెళ్లి చూడాల్సిన సినిమా ‘మంగళవారం’ అని చెబుతున్నారు’ అని దర్శకుడు అజరు భూపతి చెప్పారు.నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ, ”మా సంస్థలో మొదటి సినిమాగా ‘మంగళవారం’ చేయడం మాకు గర్వకారణంగా ఉంది. ఈ విజయం అందించిన ప్రేక్షకులకు పాదాభివందనం. ఈ సినిమాను పెద్ద సినిమాలతో కంపేర్ చేయడం మాకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.హొ హొఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ పాయల్, నటులు రవీంద్ర విజరు, అజయ్ ఘోష్, శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి, కార్తీక్, లక్ష్మణ్, గేయ రచయిత గణేష్, తరుణ్‌భాస్కర్, బివీఎస్‌ఎన్ రవి, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు.