రెండవ విడతలో లేని పేరు

– మూడవ విడత కోసం ముగ్గురు ఎదురు చూపులు
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
అశ్వారావుపేట నియేజక వర్గం అంటేనే రాష్ట్రంలో ఒక ప్రత్యేకత వున్న అసెంబ్లీ స్థానం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దానికి బిన్నంగా ఫలితం వుంటుంది. అలాంటి అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తరుఫున 8 మంది దరఖాస్తు చేసుకోగా ముచ్చటగా ముగ్గురు మధ్య పోటీ ఉంది. ఒకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నుండి జారే అధినారాయణ, రేణుక వర్గం నుండి తాటి వెంకటేశ్వర్లు, బట్టి విక్రమార్క వర్గం నుండి సున్నం నాగమణి ప్రధానంగా పోటీ పడుతున్నారు. నాకంటే నాకు వస్తుందని ప్రచారాలు చేసుకూంటూ పోతున్నారు. కొందరు మరో అడుగు ముందుకు వేసి శుక్రవారం ప్రకటించే రెండవ లిస్టులో ముగ్గురు అభ్యర్థులు ఎవరి వర్గాల వారు మా అభ్యర్థి పేరు వస్తుందని ఎవరకు వారు బాంబులు, స్వీట్లు తెచ్చుకొని ఇళ్ళల్లో పెట్టుకొని ఎంతో ఎదురు చూసారు. కానీ వారి ఆశలు అన్నీ అవిరి అయి పోయాయి. మూడవ లిస్టులో అయినా ప్రకటిస్థారో లేక నాల్గవ లిస్టు అని సాగదీస్తూ ఎవరో ఒకరు పార్టీ మారిపోయే వరకు వేచి చూస్తారో అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇంటి ఇంటి ప్రచారం మొదలు పెట్టి ప్రచారంలో దూసుకుపోతూ బతకమ్మ ఆట పాటలతో మహిళలతో పాల్గొని వారికి బహుమతులు ఇస్తూ చేస్తూ ప్రచారం మొదలు పెట్టి రోజులు గడుస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో నియోజక వర్గంలో మండలంలో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎది ఏమైనా ఒక అభ్యర్థికి టికెట్‌ వస్తే మరో అభ్యర్థి రాజకీయ మార్పులు కచ్చితంగా వుంటాయి అని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మూడవ లిస్టు కోసం కాంగ్రెస్‌ అభిమానులు, కార్యకర్తలు ఎదురు చూడక తప్పడం లేదని అశ్వారావుపేట నియోజక వర్గంలో సిటుకే ఇంత డిమాండ్‌ ఉంటే ఓటు ఎంత విలువ ఉంటుందో అని పలువురు సామాన్య ఓటర్లు చర్చించుకుంటున్నారు.