కొత్త పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి

నవతెలంగాణ – సిద్దిపేట

కొత్త పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం  ప్రత్యేక చొరవతో జులైలోనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ పూర్తి చేసి  భర్తీ చేయాలని ఎస్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్ కోరారు. ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్   ఆధ్వర్యంలో ద్వితీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వస్తున్నందున దానికంటే ముందుగా సమస్యలు పరిష్కరించాలని అన్నారు. సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ,  కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకరాలకు  అనుగుణంగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం  ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టులను  నింపుతూ, పండిట్,  పీఈటి పోస్టులను అప్ గ్రేడ్  చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి రంగారావు, పి ఎస్ డబ్ల్యూ అధ్యక్షులు  కడవేర్గు  శ్రీనివాస్, ఆర్థిక కార్యదర్శి మధు సూధన్,  రాష్ట్ర హెడ్ క్వార్టర్ సెక్రటరీ పోల్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షలు మ్యాద శ్రీధర్,   రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లేపల్లి శ్రీనివాస్,  సంఘ సీనియర్ బాధ్యులు సాదు పల్లి  యాదగిరి, లింగారెడ్డి, సంపత్, రాములు,  రామంచ రవీందర్, హరిబాబు, శ్రీకాంత్, శ్రీనివాస్, ఉపేందర్ గౌడ్, రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్, ఫణీంద్ర,  శ్రీనివాస్, సుధాకర్,  మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.