దెయ్యాల వాగు ముంపు కు శాశ్వత పరిష్కారం

 – పైడాకుల అశోక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.
నవతెలంగాణ-గోవిందరావుపేట: మండలంలోని దెయ్యాలవాగు పరివాహక ప్రాంతంలో ముంపు బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నారు. గురువారం మండలంలోని చల్వాయి బుస్సపూర్ గ్రామాలలో ఆయా గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో విస్తృత ఎన్నికల ప్రచారంలో అశోక పాల్గొన్నారు. మండల కేంద్రంతో పాటు పసర గ్రామంలో కూడా ఇంటింటి ఎన్నికల ప్రచారంలో అశోక పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పథకాల అవశ్యకతను ఓటర్లకు వివరిస్తూ ఓట్ల అభ్యర్థించారు. మండల కేంద్రంలోని సి.ఎస్.ఐ. చర్చిలోని క్రైస్తవులతో మాట్లాడి, అలాగే గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ గురించి ఆరు గ్యారెంటీలు సీతక్క గెలుపును వివరించారు. అనంతరం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ సీతక్క ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రజాసంఘాల నాయకులు సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.