ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

నవతెలంగాణ-తలకొండపల్లి
ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘట న మండల పరిధిలోని చీపు నుంత గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం మండల పరిధిలోని కోమటి కుంట తాండాకు చెందిన ముడావత్‌ వాస్యనా యక్‌ (55) తమ గ్రామం నుంచి తలకొం డపల్లి వైపునకు బైక్‌పై వెళ్తుండగా చీపు నుంతల గేటు సమీపంలో ప్ర మాదవశా త్తు బైక్‌ అదుపు తప్పి కిందపడి పోయింది. ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయా లై ప్రమాద స్థలంలోనే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకటేశ్‌ తెెలిపారు.