నవతెలంగాణ-తాండూరు రూరల్
రెండు రోజుల క్రితం వాగు దాటుతుండ గా బండల వాగులో కొట్టుకుపోయిన పెంటప్ప శవంగా ఆదివారం లభ్యమయ్యాడు. సంగెంకలా న్‌కు చెందిన బొక్తంపల్లి పెంటప్ప(48) శుక్రవా రం కర్ణాటకలో షాపూర్‌లో బంధువులతో కలిసి అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా గ్రామ సమీపం లోని బండల వాగు భారీ వర్షానికి ఉదతంగా ప్రవహించింది. గ్రామస్తులు వారించినా పెంట ప్ప వాగును దాటే ప్రయత్నం చేసి గల్లంతయ్యా డు. విషయం తెలుసుకున్న పోలీసులు అర్దరాత్రి వరకు గాలింపు చేపట్టారు. మరుసటి రోజు పోలీ సులు, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బందాలతో గాలింపు చేపట్టిన ఆచూకీ లభిం చలేదు. ఆదివారం బండల వాగులోని బస్వరా జ్ పటేల్ పొలం సమీపంలో పెంటప్ప మతదే హాన్ని గుర్తించారు. గ్రామస్తులు పోలీసులకు, సర్పంచ్‌కు సమాచారం అందించారు. మతదే హాన్ని వాగులోకి వెలికి తీసి పోస్టుమార్టం నిమి త్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మ తునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.పెంటప్ప కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, గ్రామస్తులు కోరుతున్నారు.