మొక్కు తీర్చుకున్న సర్పంచ్

నవతెలంగాణ తిరుమలగిరి: ఎర్రవరంలో మామిడాల గ్రామ సర్పంచ్ బెడిద కరుణాకర్ మొక్కు తీర్చుకున్నారు.
నవంబర్ 30న జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామెల్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని కాంక్షిస్తూ..ఎర్రవరం లక్ష్మీనరసింహస్వామికి కరుణాకర్ మొక్కుకున్నారు. ఈనెల 3న ఎన్నికల ఫలితాల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మందుల సామెల్ 51 వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు. దీంతో మండలంలోని సర్పంచ్ బెడిద కరుణాకర్ సోమవారం కోదాడకు వెళ్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వెయ్యి కొబ్బరికాయలు కొట్టి తన మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ అక్టోబర్ చివరివారంలో నేను మందుల సామెలుకు ఎమ్మెల్యే టికెట్ రావాలని ఎర్రవరం లక్ష్మీనరసింహస్వామి గుడిలో వెయ్యి కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను అదేవిధంగా సోమవారం డిసెంబర్ 4 న ఎర్రవరం వెళ్లి కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకొని వచ్చానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామేల్ ఉన్నారని, ఆయన ఎన్ని ఉద్యమాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వపోవడంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వగా ప్రజలందరూ ఏకమై మందుల సామేలును అత్యధిక మెజార్టీ గెలిపించి అరాచక పాలనకు చరమగీతం పాడారని ఆయన అన్నారు. తుంగతుర్తితో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు.