
మాణిక్ భవన్ పాఠశాలలో 1969 -70 సంవత్సరం ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము 53 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా కుటుంబ సభ్యులతో సహా స్థానిక లహరి హోటల్ లో మంగళవారం స్నేహితుల దినోత్సవం రోజున ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్నప్పటి జ్ఞాపకాలను, చిలిపిచేష్టలను, అరేయ్, ఒరేయ్ అనుకుంటూ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అప్పటి గురువులు చెప్పిన చదువు సంస్కారమే మన జీవితాలు స్థిరపడటానికి దోహదపడ్డాయని గురువులను స్మరించుకున్నారు. ఉదయం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమం పరిచయాలతో, తీపి జ్ఞాపకాలతో, చివరగా అట పాటలతో కార్యక్రమం పూర్తి చేస్తూ వచ్చే సంవత్సరం స్నేహితుల దినోత్సవం రోజున అందరు కలుద్దామని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ముఖ్య ప్రోత్సాహకుడు నర్సారెడ్డిని, అదేవిధంగా మెమొంటోలు అందజేసిన సురేందర్ రెడ్డి ని అందరూ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు .ఈ కార్యక్రమం లో జిల్లా రైసుమిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మోటూరి దయానంద్ గుప్త ,హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రవికిరణ్ రావు, ప్రముఖ వాణిజ్యవేత్తలు నవీన్ రెడ్డి, సురేష్, రాజాశంకర్, శ్రీహరి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.