నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజావాగ్గేయకారులు గద్దర్ సతీమణి విమలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ జ్యోతి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్ బుధవారం హైదరాబాద్‌లోని వెంకటాపురంలో గల వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా కూనంనేని, చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహం ప్రతిష్టించి, స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన సాహిత్యాన్ని, జానపదాలను, పల్లెపాటలను నిక్షిప్తం చేసి, భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. విమలను కలిసిన వారిలో సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గసభ్యులు టి శంకర్, అల్వాల్ మండల కార్యదర్శి కె సహదేవ్, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లత, కార్యదర్శి స్వరూప, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మహేందర్ తదితరులున్నారు.