గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

– ఇద్దరు పోలీసుల సహా 9మంది మతి
నవతెలంగాణ-అహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని సరేజ్‌-గాంధీనగర్‌ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఇస్కాన్‌ పైవంతెన వద్ద జరిగిన కారు ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులతోపాటు తొమ్మిది మంది మతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.