ఇసుక సోసైటి గ్రామ సభను వెంటనే జరిపించాలి

– యాసం రాజు తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు
నవతెలంగాణ-ములుగు
వెంకటాపురం మండలం అంకన్న గూడెం (పూజారి గూడెం) ఇసుక సొసైటీ గ్రామసభలు వెంటనే జరిపించాలని తుంది రాష్ట్ర ఉపాధ్యక్షులు యాసం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఈ గ్రామంలో పిసా గ్రామ సభను వాయిదా వేయడం పై ఆందోళన చేపట్టిన తుడుం దెబ్బ నాయకులు కలెక్టరేట్ కార్యాలయం ముందు అధికారుల నిర్లక్ష్యం ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆందోళన చేపట్టి కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఈ విషయమై ఐటిడిఏ పిఓ అంకిత్ కుమార్ కు కూడా వినతిపత్రం అందించినట్లు పేర్కొన్నారు. వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలోని అంకన్నగూడెం పీసా క్లష్టర్ పూజారి గూడెం పీసా గ్రామసభ అర్హత కలిగిన శ్రీ కొమ్మలమ్మ గిరిజన ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కు సంబంధించిన సొసైటీ ఈనెల 27వ తేదీన జరగాల్సిన గ్రామసభను అధికారులు వాయిదా వేయడం అమానుషమని అన్నారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు శనివారం రోజున స్థానిక పాఠశాల ఆవరణకు గిరిజనులు చేరుకొని అదికారుల కొసం ఎదిరి చూస్తూండా ముందస్తూ సమాచారం లేకుండానే గ్రామసభను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి ఆదివాసి గిరిజన పట్ల చోద్యం చేస్తున్నారన్నారు. గిరిజన సొసైటీ గ్రామసభలను వాయిదా వేయడానికి పని కట్టుకుని కొండూరి రమేష్ బాబు, బట్టు శీను, మరియు  ముత్యాల్ రావు అనే ముగ్గురు వ్యక్తులు  వారి స్వలాభం కోసం గిరిజన సొసైటీల సమావేశాలను వాయిదా వేస్తూ సోసైటి ఆదాయానికి గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన జిల్లా శాఖ అధికారులు స్పందించి శ్రీ కొమ్మలమ్మ గిరిజన ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీ పీసా గ్రామ సభలను వెంటనే జరిపించి సొసైటీ నిర్వహణ జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదికారులను కోరారు. దీనికి స్పందించిన కలెక్టరేట్ అతి త్వరలో అదికారులతో చర్చంచి గ్రామ సభ నిర్వహణ చేసి గిరిజన సోసైటీలకు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, గ్రామ ప్రజలు, తుడుం దెబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు.