నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వివేకానంద విదేశీ విద్యా పథకం, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక సహాయం పథకం(బెస్ట్) కింద శుక్రవారం నుంచి దరఖాస్తులను స్వీకరణ ప్రారంభమైందని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక సహాయం కావాలనుకునే పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే వారికి వివేకానంద విదేశీ విద్యా పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తును సంప్రదించాలని సూచించింది.