ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధం

నవతెలంగాణ-కొడంగల్‌
ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన సంఘటన దౌల్తాబాద్‌ మండ లం గుండెపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గడ్డి వాము దగ్ధమైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తెలుగు నారప్పకు చెందిన గడ్డివా ము ప్రమా దవశాత్తు నిప్పంటుకొని దగ్ధమైంది. సుమారు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మంటలు ఆర్పే లోపు పశుగ్రాసం మొత్తం కాలి బూ డిదై పోయింది. తన పశువులు ఆకలితో అలమటిస్తాయని, తిరిగి పశుగ్రా సం కొనడానికి తన వద్ద ఆర్థిక స్తోమత లేదని, తమను ప్రభుత్వం ఆదు కోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.