పండ్ల తోటల పెంపకం లక్ష్యాన్ని  పూర్తి చేయండి : ఎం.పి.డి.ఒ శ్రీనివాస్

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలానికి కేటాయించిన  పండ్ల తోటల పెంపకం లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఎంపీడీవో జి. శ్రీనివాసరావు ఉపాది ఫీల్డ్  అసిస్టెంట్లను ఆదేశించారు. గ్రామీణ ఉపాధి పధకం క్రింద అమలవుతున్న ప్రతి రైతుకు ఖచ్చితంగా జూబ్ కార్డు ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆయన ఉపాది సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మండలంలో 584 ఎకరాలకు గాను పండ్ల తోటలు పెంచే రైతులను గుర్తించాలని చెప్పారు. మామిడి, జీడి మామిడి, పామాయిల్, కొబ్బరి, తదితర పండ్ల తోటలకు ప్రభుత్వం సబ్సీడీ అందిస్తుందని, దీనితో పాటు రాయితీపై తోటలకు డ్రిప్ సాక్యూన్ని మంజూరు చేస్తుందని అన్నారు. అలాగే గ్రామ పంచాయితీ నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను రహదారులు, పల్లె ప్రకృతి వనాల చుట్టూ నాటించాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసి రైతులతో పండ్ల తోటలు పెంచే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు.
సమావేశంలో ఈజీఎస్ ఏపీవో తలుపులు నరేష్,పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.