ప్రయివేట్‌ కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్‌ కుమార్‌
నవతెలంగాణ-మహదేవ్‌పూర్‌
ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఇంటింటా గ్రామ గ్రామాన కరపత్రాలు, వాల్‌ పోస్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నపటికి విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యహావరిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజకుమార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత విద్యార్థి సమైక్య ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ రోజు మహాదేవపూర్‌ మండల కేంద్రంలో ఉన్నా గ్రామ గ్రామాన కరపత్రాలు, బ్యానర్లతో ప్రైవేట్‌ విద్యా సంస్థలు ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఆయన మాట్లడుతూ మహాదేవపూర్‌ మండల లో ప్రైవేట,్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలు గ్రామ గ్రామాన కరపత్రాలను ప్రచారం చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ఉండడం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యహావరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దిక్కు ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యా సంస్థలకు ఫీజులు దోపిడిని అరికట్టే విధంగా వేసిన క్యాబినెట్‌ కమిటీ కూడా ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా పది రోజుల్లో విద్య సంస్థలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువచ్చినప్పటికి దున్నపోతు మీద వాన పడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల దోపిడీని అరికట్టే విధంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని వారు డిమాండ్‌ చేశారు. ఒక దిక్కు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న ఇంటింటా క్యాంపెయిన్‌ను, వాడ వాడలా వాలపోస్టర్లను వీటిపై వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రైవేట, కార్పొరేట్‌ పాఠశాలల, ఉపాధ్యాయులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని వారు డిమాండ్‌ చేశారు. లేనియెడల ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.